ఫస్ట్ రానా.. నెక్స్ట్ చరణ్.. ఆపై రవితేజ!
on Dec 16, 2021

కరోనా ఎఫెక్ట్ తో సినిమాల విడుదల ప్రణాళికలో గందరగోళం నెలకొంది. దీంతో కొంతమంది స్టార్స్ సినిమాలు తక్కువ గ్యాప్ లోనే థియేటర్స్ లోకి రాబోతున్నాయి. రానా, రామ్ చరణ్, రవితేజ.. ఇలా ప్రముఖ కథానాయకుల చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవ్వడమే ఇందుకు నిదర్శనం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ డిసెంబర్ 31న `1945` అనే పిరియడ్ డ్రామాతో పలకరించబోతున్న దగ్గుబాటి రానా.. ఆపై రెండు వారాల్లోపే అంటే జనవరి 12న తను ఓ ప్రధాన పాత్రలో నటించిన `భీమ్లా నాయక్`తో ఎంటర్టైన్ చేయనున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. జనవరి 7న జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన పిరియడ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`తో జనం ముందుకు రానుండగా.. ఆపై ఫిబ్రవరి 4న తన తండ్రి చిరంజీవితో జట్టుకట్టిన `ఆచార్య`తో వినోదాలు పంచనున్నారు. అలాగే రవితేజ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 11న యాక్షన్ థ్రిల్లర్ `ఖిలాడి`తో థియేటర్స్ లోకి వచ్చి.. ఆపై మార్చి 25న `రామారావు ఆన్ డ్యూటీ` అంటూ అలరించబోతున్నారు.
Also Read:మహేష్, చరణ్ ల మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
మరి.. రెండు వరుస నెలల్లో తమ కొత్త చిత్రాలతో రాబోతున్న రానా, రామ్ చరణ్, రవితేజ.. ఆయా సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



